గుడిసెలోని బొమ్మలనే రాముడిగా పిలిచారు: కర్ణాటక మంత్రి వివాదాదస్పద వ్యాఖ్యలు

by samatah |
గుడిసెలోని బొమ్మలనే రాముడిగా పిలిచారు:  కర్ణాటక మంత్రి వివాదాదస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రామ్ లల్లా విగ్రహంపై కర్ణాటక మంత్రి ఎన్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత బీజేపీ గుడారంలో రెండు బొమ్మలను ఉంచి దానికి రాముడు అని పేరు పెట్టారని అన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాజన్న ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో కాషాయ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘దేశలంలో వేల ఏళ్ల చరిత్ర ఉన్న రామ మందిరాలున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కోసం ఆలయాలు నిర్మిస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేత టైంలో నేను అయోధ్యకు వెళ్లాను. అప్పుడు ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత రెండు బొమ్మలను ఓ గుడిసెలో ఉంచారు. డేరా వేసి వారిని రామ్ అని పిలిచారు’ అని అన్నారు. రాజన్న వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు పూర్తి నిరాశలో ఉన్నారని అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed