అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఏం చేస్తే మంచిదో తెలుసా?

by Hamsa |
అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఏం చేస్తే మంచిదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: సోమవారం జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అక్కడి హిందువుల కల నెరవేరడంతో పాటు సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు రామ భక్తులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు ముందుగానే ప్రధాని మోడీ అందరికీ రామమందిర అక్షింతలు ప్రతి ఇంటికి పంచి పెట్టాలని ఆదేశించారు.

ఇప్పటికే అంతా తమ పూజ గదుల్లో వాటిని ఉంచారు. అయితే అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలు ఏం చేస్తే మంచిదో అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పండితులు ఆ అక్షింతలు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తే మంచిదో తెలిపారు. పిల్లలను ఆశీర్వదించేటప్పుడు రామ మందిర అక్షింతలు వాడితే వారికి మంచి జరుగుతుందట. అలాగే పుట్టిన రోజులు, పెళ్లి రోజు, ఇతర శుభకార్యాలకు, ఉద్యోగ ప్రమోషన్ వంటి సందర్భాల్లో వాడాలి.

లేదా ఎర్రని పట్టు వస్త్రంలో కట్టి భద్రంగా దాచి పెట్టుకుంటే సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట. పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఎలాంటి కొదవా ఉందడు. ఈ అక్షింతలను నైవేద్యంగా వండుకుని ప్రసాదంగా కుటుంబమంతా తినొచ్చు. కొందరు బొట్టు పెట్టుకునేటప్పుడు బియ్యాన్ని ఉపయోగిస్తుంటారు. అలాంటి సమయంలో రామ మందిర అక్షింతలు వాడొచ్చని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed