90మందికి పైగా ట్రైనీ పోలీసులకు పాజిటివ్

by Shamantha N |
90మందికి పైగా ట్రైనీ పోలీసులకు పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా దేశవ్యాప్తంగా ఓ అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90మందికి పైగా ట్రైనీలకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో మొదట ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ట్రైనింగ్ సెంటర్‌లోని అందరికీ ర్యాండమ్ పరీక్షలు జరిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. వీరిలో కరోనా బారిన పడిన ట్రైనీ పోలీసులను గుర్తించి కొవిడ్ ఆస్పత్రులకు, కేర్ సెంటర్లకు పంపించారు. ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న మరో 150 మందిని కూడా క్వారంటైన్‌ చేశారు. అనంతరం స్కూల్ పరిసరాలను మొత్తం శానిటైజేషన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బెంగళూరు వ్యాప్తంగా ఇప్పటివరకు 1000మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడగా, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్రైనీ పోలీసుల ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed