- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రలో ఉన్న కుటుంబీకులు.. లైటు వేయడంతో 9 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నగర శివారులోని ఓ ఇంట్లో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 10 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాటికి 8 మంది మరణించగా, తాజాగా శనివారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కు చేరినట్టు అధికారులు తెలిపారు.
‘ మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన కుటుంబం ఫ్యాక్టరీలో పనిచేస్తు ఓ చిన్నగదిలో ఉంటున్నారు. వారంతా గురువారం రాత్రి నిద్రలో ఉండగా గదిలో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ వాసనను పసిగట్టి వారిని అలెర్ట్ చేద్దామని పొరుగింటి వారు తలుపు తట్టారు. దీంతో నిద్రలో ఉన్న వారు తలుపు తీసేందుకు లేచి లైట్ వేశారు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పొరిగింటి వ్యక్తితో పాటు మరో 9 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 9 మంది మరణించారు’అని పోలీస్ అధికారులు తెలిపారు. మరణించిన వారిని రాం ప్యారీ అహిర్ వార్(56), రాజుభాయ్ అహిర్వార్ (31), సోను అహిర్వార్ (21), సీమా అహిర్వార్ (25), సర్జూ అహిర్వార్ (22), వైశాలి (7), నితేశ్ (6), పాయల్ (4), ఆకాశ్ (2)గా గుర్తించారు. కులసిన్హా భైరవ(30) చికిత్స పొందుతున్నట్టు ఎస్ఐ జడేజా తెలిపారు.