కపిల్ దేవ్ '83'పై కరోనా ఎఫెక్ట్

by Shyam |
కపిల్ దేవ్ 83పై కరోనా ఎఫెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ కపిల్ దేవ్ చిత్రంపై పడింది. కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ’83’. రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్‌గా కనిపించబోతున్న ఈ సినిమా విడుదలను కోవిడ్ 19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దేశం కరోనా కారణంగా కలవరపడుతోందని…. సాధారణ పరిస్థితులు నెలకొనగానే సినిమా విడుదలపై ప్రకటన చేస్తామని తెలిపింది. ’83’ కేవలం మా ఒక్కరి సినిమానే కాదని.. ఇది భారతజాతి మొత్తానికి చెందిన సినిమా అని చెప్పింది మూవీ యూనిట్. కానీ దేశ ప్రజల రక్షణ, ఆరోగ్యమే ముఖ్యమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటించాలని.. మీ ఆప్తులను జాగ్రత్తగా చూసుకోవాలని అభిమానులను కోరింది. దృష్టిలో ఉంచుకుని ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి విజయం సాధించడమే ’83’ చిత్రం కథ… అలాగే మనం కూడా కరోనా వైరస్‌పై త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది మూవీ యూనిట్.

ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ’83’ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్‌గా నటిస్తుండగా .. తన భార్య రోమీ భాటియాగా దీపికా పదుకోన్ నటించింది. కబీర్ ఖాన్, సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన చిత్రానికి ప్రీతం చక్రబొర్తి, జూలియస్ పేకియమ్ సంగీతం అందించారు. హార్డి సందు, జీవా, తహిర్ బాసిన్ సినిమాలో ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. అయితే ’83’ చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు అభిమానులు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తొలిసారిగా ఈ సినిమాను డైరెక్ట్ టీవీల్లో రిలీజ్ చేసి ఎంటర్టైన్ చేయాలని కోరుతున్నారు.

Tags: Kapil Dev, CoronaVirus, Covid19, Release

Advertisement

Next Story

Most Viewed