- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఐటీ మద్రాసుతో జతకట్టిన ప్రభుత్వం.. 8 కీలక ఒప్పందాలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతితో పాటు పలు ప్రాంతాల అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో భారీ సంస్థలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో ఆధునాతన సాంకేతికను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఐఐటీ మద్రాసుతో ప్రభుత్వం జతకట్టింది. అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో కలసి పని చేసేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 8 విభాగాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.
ఐఐటీఎం – ఏపీ సీఆర్డీఏ మధ్య జరిగిన ఒప్పందం
అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు. అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఏపీ ప్రభుత్వంతో ఐఐటీఎం సంస్థ కలసి పని చేయాలని నిర్ణయించారు.
ఐఐటీఎం, ఏపీ మారిటైమ్ బోర్డు మధ్య జరిగిన ఒప్పందం
సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతోపాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలే లక్ష్యం పని చేయాలని ఒప్పందం కుదిరింది.
ఐఐటీఎం – ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం ఇదీ..
స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫారాల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది.
ఐఐటీఎం – ఏపీ విద్యాశాఖ మధ్య ఒప్పందం
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాయి. అంతేకాదు ఐఐటీఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఏపీలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణ ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది.
ఐఐటీఎం – ఇన్వెస్టిమెంట్ & ఇన్ ఫ్రాస్ట్చక్చర్ శాఖ ఒప్పందం
విమానాశ్రయాలను లాజిస్టిక్స్ / మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చేందుకు ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలతో పాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఒప్పందం జరిగింది.
ఐఐటీఎం, ఐటీ శాఖ మధ్య జరిగిన ఒప్పందం ఇదే..
అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడంతో పాటు తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా పని చేసేందుకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది.
ఐఐటీఎం – ఆర్‌టీజీఎస్ శాఖ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కలసి పని చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
ఐఐటీఎం, క్రీడల శాఖ మధ్య జరిగిన ఒప్పందం ఇదే..
అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని, ఇందుకు సాంకేతిక సలహాలు పొందేందుకు ఒప్పందం కుదిరింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.