- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP: హోంమంత్రి అనిత కాదు.. నారా లోకేష్.. మాజీమంత్రి అంబటి హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో హోంమంత్రి అనిత(Home Minister Anita) కాదు.. నారా లోకేష్(Lokesh Nara) అని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(YCP leader Ambati Rambabu) అన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన వైయస్ఆర్‌సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి(YSRCP leader Punuru Gautham Reddy) నివాసానికి అంబటి సహా వైసీపీ నేతలు వెళ్లి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
అలాగే గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటే వేరే మార్గమే లేదా? అని విజయవాడ పోలీస్ కమిషనర్(Vijayawada Police Commissioner) ,డీజీపీ(DGP)లను ప్రశ్నించారు. అలాగే హోంమంత్రి అనిత ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారా? అని, నేరం మోపబడిన వ్యక్తి ఇంట్లో ఇలా ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. రాష్ట్రంలో హోంమంత్రి అనిత కాదు.. నారా లోకేష్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిత మైక్ ముందే హోంమంత్రి.. అసలు హోంమంత్రి నారా లోకేష్ అని, హోంమంత్రికి ఎస్ఐ ను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం కూడా లేదని అన్నారు. లోకేష్ చెప్తేనే సీఐలు, ఎస్సైలు ట్రాన్స్ ఫర్ అయ్యే పరిస్థితి ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు.