AP News:‘జగన్ ఏ పథకాన్ని ఆపలేదు’.. వైసీపీ నేత కన్నబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘జగన్ ఏ పథకాన్ని ఆపలేదు’.. వైసీపీ నేత కన్నబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో ఈ రోజు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో(assembly budget meetings) గత ప్రభుత్వ పాలన పై కూటమి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత కురసాల కన్నబాబు(YCP leader Kurasala Kannababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేత((YCP leader) కురసాల కన్నబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలన పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) హయాంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోలేదని కురసాల కన్నబాబు అన్నారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. కానీ.. రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసిందని, చంద్రబాబు(CM Chandrababu) ఏదో అద్భుతం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఒక్క పథకం కూడా ప్రారంభించలేదని విమర్శించారు. ఈ క్రమంలో శాసనసభలో టీడీపీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది అని ఆయన మండిపడ్డారు.

Advertisement

Next Story