8 నిమిషాల సీన్.. 55 రోజుల షూటింగ్

by Shyam |
8 నిమిషాల సీన్.. 55 రోజుల షూటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, దర్శకధీరుడు రాజమౌలి కాంబినేషన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం టీజర్లు రికార్డులు తిరగరాసాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే రాజమౌలి కూడా తన సినిమాల స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తుంటాడు. ఒక సినిమాకు మించి మరో సినిమా ఎలా తీయాలో ఆలోచిస్తుంటాడు. చరిత్రలో ఎక్కడా కలవని ఇద్దరు వీరులను తెరపై కలిపి చూపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కనీవినీ ఎరుగని రీతిలో చూపించబోతున్నాడట జక్కన్న. క్లైమాక్స్ ఎనిమిది నిమిషాలు ఉండగా, ఆ 8 నిమిషాల నిడివి ఫైట్‌ను 55 రోజులు షూట్ చేసినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోందని తెలస్తోంది. మరి దీనిపై జక్కన ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Next Story