- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జొన్నపొత్తుల సెల్వమ్మ…నీ సోలార్ ఫ్యాన్ ఐడియా సూపరమ్మా..!!
దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడుకు చెందిన ఓ వృద్ధురాలు మొక్కజొన్ను పొత్తులు కాల్చే విధానంతో సెలెబ్రెటీ అయిపొయింది. బెంగుళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటును ఈ అమ్మ పేరు సెల్వమ్మ. ఈమెకు ఎవ్వరు లేరు.. ఆర్థిక ఇబ్బందులు, నాఅన్న వారు ఎవ్వరూ లేరు అనే మనోవేదనతో ఓ సారి ఆత్మహత్యకు కూడా పాల్పడింది. ఆ ఘటన నుండి బయటపడిన సెల్వమ్మ ఎలాగైనా తన కాళ్లపై తాను నిల్చొని బ్రతికి తీరాలని సంకల్పించుకుంది.
అయితే రోజు వందలాది మంది వచ్చివెళ్లే రోడ్డుపై మొక్కజొన్న పొత్తులు అమ్మడం మొదలు పెట్టింది. ఉదయం నుండి మొదలు పెడితే రాత్రి వరకు చేతితో విసనకర్ర విసురుతూ జొన్న పొత్తులు కాల్చేది. సెల్వమ్మ కష్టం చూడలేని ఓ ధర్మాత్మురాలు సోలార్ ఫ్యాన్ సెట్ ను ఆమెకు ఉచితంగా ఇచ్చింది. ఆమె దేవతలా వచ్చి… ఇది ఇచ్చిందని చెప్పింది సెల్వమ్మ. ఇప్పుడు ఆమె ఆ సోలార్ ఫ్యాన్ ను వినియోగిస్తూ మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంది. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో సెల్వమ్మ గురించి వివరించి, సోలార్ ఫ్యాన్ వాడే విధానాన్ని మెచ్చుకోవడంతో ప్రస్తుతం నెట్టింట ఈ పిక్ వైరల్ గా మారింది.