- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్షణ రంగంలోకి 74శాతం ఎఫ్‌డీఐల అనుమతి: ప్రధాని
X
న్యూఢిల్లీ: రక్షణరంగ ఉత్పత్తిలో 74శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)కు ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించడానికి నిర్ణయించినట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. కీలకరంగాల్లో స్వయంగా ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్షించిందని వివరించారు. భారత్‌లో ఎఫ్‌డీఐలు రెండు మార్గాల్లో ప్రవేశిస్తాయి.
ఒకటి ప్రభుత్వ ఆమోదం అవసరంలేని ఆటోమేటిక్ రూట్, మరొకటి ప్రభుత్వ ఆమోదంతోనే ప్రవేశిస్తాయి. భారత్‌లోనే ఉత్పత్తి పెంచాలని, నూతన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలన్నదే సర్కారు ధ్యేయమని ప్రధాని తెలిపారు. ఇందుకోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. 101 రక్షణ రంగ వస్తువులపై విధించిన నిషేధాన్ని మరిన్నింటికీ వర్తింపజేస్తామని వివరించారు. డిఫెన్స్ సెక్టార్ చుట్టూ అల్లుకున్న సంకెళ్లను తాము తీసుకుంటున్న నిర్ణయాలు తెంచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Next Story