- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో కరోనా విజృంభణ @730
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసులు వందల సంఖ్యల్లో పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి అయితే వైరస్ మరింతగా విజృంభిస్తోంది. ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేసరికి ఏకంగా 730 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఆదివారం ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లోనే ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదేతొలిసారి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 659 కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 7,802 చేరాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 210 మంది మృతి చెందారు. ప్రస్తుతం వైరస్ సోకి 3861 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3731 మంది మహమ్మారిని జయించి డిశ్చార్జి అయ్యారు. కాగా, ఈ రోజు ఒక్కరోజే 225 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు:
జీహెచ్ఎంసీ -659
జనగాం -34
రంగారెడ్డి -10
మేడ్చల్ -9
వరంగల్ -6
ఆసిఫాబాద్ -3
వికారాబాద్ -2
సంగారెడ్డి -1
ఆదిలాబాద్ -1
భద్రాద్రి కొత్తగూడెం -1
నారాయణపేట్ -1
మెదక్ -1
నల్గొండ -1
యాదాద్రి భువనగిరి -1