కేరళలో 69 వేల పక్షుల సంహరణ

by Sumithra |
కేరళలో 69 వేల పక్షుల సంహరణ
X

తిరువనంతరపురం: బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం గురువారం కేరళ రాష్ట్రంలోని అలప్పూజా, కొట్టాయం జిల్లాలో పర్యటించింది. బర్డ్ ఫ్లూ భయాందోళనలతో చాలా రాష్ట్రాల్లో ఫౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. అమ్మకాలు భారీ స్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి అంచనాపై దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రజారోగ్య నిపుణురాలు రుచి జైన్, పుణె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రేవేత్త డాక్టర్ శైలేష్ పవార్, ఢిల్లీ ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ ఫిజిషియన్ అనిత్ జిందాల్‌తో కూడిన బృందం అల్లప్పూజ కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగంతో బర్డ్ ఫ్లూ పరిస్థితిపై చర్చించింది. ఆ తర్వాత కరుట్టాలోని ఫ్లూ వ్యాప్తికి మూల కేంద్రమైన చోటును పరిశీలించారు. అల్లప్పూజ, కొట్టాయం జిల్లాల్లో బుధవారం వరకు దాదాపు 69వేల బాతులు, కోళ్లను సంహరించినట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ సోకిన పక్షులను సంహరించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాల కోసం 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story