- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేపాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన భారతీయులు
ఖాట్మాండు: భారత సరిహద్దు దేశం నేపాల్‌లో కూడా కరోనా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కరోనా బారిన పడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ పర్యటనకు వెళ్లిన భారతీయులకు కరోనా సోకడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి గత కొన్ని రోజులుగా వైద్యం అందిస్తున్నారు. వీరికి గత కొన్ని రోజుల నుంచి బిరాత్ నగర్‌లోని కోశి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. అయితే వీరికి సదరు ఆసుపత్రిలో పలు మార్లు కరోనా నిర్థారణ పరీక్షలు జరిపారు. వరుసగా నాలుగు సార్లు నెగెటివ్ వచ్చిన రోగులను డిశ్చార్జ్ చేసినట్లు కోశీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగీత మిశ్రా తెలిపారు. రెండు సార్లు కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన భారతీయులను మరో 19 రోజులు ఆసుపత్రిలోనే క్వారంటైన్ చేశామని.. వాళ్లు పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. కోశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన భారతీయులకు నేపాల్ సామాజికాభివృద్ధి శాఖ మంత్రి జీవన్ గిమైర్ వీడ్కోలు పలికారు. కాగా, ఇదే ఆసుపత్రిలో మరో ఏడుగురు భారతీయులు చికిత్స పొందుతున్నారు.
Tags: Indian, Nepal, Coronavirus, Discharge, Koshi Hospital, Kathmandu, Covid 19