రెడ్‌మీ నుంచి బడ్జెట్ ధరలో 5జీ ఫోన్

by vinod kumar |
రెడ్‌మీ నుంచి బడ్జెట్ ధరలో 5జీ ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్ :
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ షియోమీ.. రెడ్‌మీ 10ఎక్స్ 5జీ, రెడ్ మీ 10ఎక్స్ ప్రో 5జీ పేర్లతో 10ఎక్స్ సిరీస్ ఫోన్లను చైనాలో అధికారికంగా ఆవిష్కరించింది. లాంచ్ చేసిన మూడు వేరియంట్లలోనూ కొద్దిపాటి మార్పులతో ఫీచర్లు ఒకేవిధంగా ఉన్నాయి. కాగా ఇండియాలో ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టత లేదు.

రెడ్‌మీ 10ఎక్స్ స్మార్ట్ ఫోన్ 4జీ, 5జీ వేరియంట్లలో అందిస్తుండగా, రెడ్‌మీ 10ఎక్స్ ప్రో మాత్రం కేవలం 5జీ వేరియంట్‌లో లభించనుంది.

రెడ్‌మీ 10ఎక్స్ 5జీ ఫీచర్స్ :

ర్యామ్ : 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 64జీబీ, 128జీబీ 256జీబీ
కెమెరా : 48 +8+2+2 ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 16ఎంపీ
డి‌స్‌ప్లే : 6.56 ఇంచ్
ప్రాసెసర్ : మీడియాటెక్ డిమెన్సిటీ 820
బ్యాటరీ : 4520 ఎంఏహెచ్
కలర్స్ : బ్లూ, గోల్డ్, వైట్, పింక్
ధర : 17000 – 25,500/- (ర్యామ్, స్టోరేజ్‌ను బట్టి )

రెడ్‌మీ 10 ఎక్స్ ఫ్రో 5జీ ఫీచర్స్ :

ఇందులో రెండు ఫీచర్లు మాత్రమే భిన్నంగా ఉన్నాయి. కెమెరా 48+8+5+5 ఎంపీ ఉండగా, ఫ్రంట్ కెమెరా 20 ఎంపీగా ఉంది. ధరలు 24300-27,500/-

రెడ్‌మీ 10ఎక్స్ 4జీ ఫీచర్స్:

డిస్‌ప్లే : 6.53
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్
ర్యామ్ : 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128 జీబీ
కెమెరా : 48+8+2+2
ఫ్రంట్ క్యామ్ : 13 ఎంపీ
బ్యాటరీ : 5020ఎంఏహెచ్
ధర : 10500-12700/-

Advertisement

Next Story