మంచిర్యాలలో 56 మందికి పాజిటివ్

by Aamani |   ( Updated:2021-04-04 09:11:02.0  )
corona virus
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా 582 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 56 మందికి పాజిటివ్‌‌ అని తేలింది. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు 54 మంది ఉండగా, కేవలం మంచిర్యాలకు చెందిన ఇద్దరికీ కరోనా వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం మంచిర్యాలలో 56 కరోనా కేసులు వెలుగుచూసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed