- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ ప్రార్థనలకు 52 మంది హాజరు!
దిశ, వరంగల్:
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రప్రభుత్వం లాక్ డౌన్ విధించి ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తుంది. అయితే ఈ నెల 13 నుంచి15 వరకు జరిగిన ఢిల్లీ ప్రార్ధనల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 52 మంది పాల్గొన్నట్టు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వరంగల్ అర్బన్ నుంచి 38, వరంగల్ రూరల్ -1, జనగామ – 4, ములుగు – 2, మహబూబాబాద్ – 6, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి- 1 ఉన్నట్టు నిర్దారించింది. వీరంతా ఢిల్లీ నుంచి వారివారి స్వస్థలాలకు తిరిగొచ్చాక ఎవరిని కలిశారు? ఎక్కడికి వెళ్లారు అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టయితే వారికి చెందిన సమాచారాన్ని వెంటనే స్థానిక పోలీసులు, వైద్యాధికారులకు అందజేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
State Helpline – 104
, Warangal Collectorate – 1800 425 1115
, MGM Hospital – 94906 11940,
DMHO Office – 79939 69104
Tags: carona, lockdown, delhi prayer, 52 members, help line numbers