స్వర్గంలో ఉన్న పిల్లికి లేఖ..

by Shyam |   ( Updated:2020-09-14 05:39:03.0  )
స్వర్గంలో ఉన్న పిల్లికి లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్: మన జీవితంలో ముఖ్యమైన వాళ్లు (ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, లవింగ్ పెట్స్) దూరమైతే.. ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఆ పెయిన్ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు కాస్త టైమ్ పడుతుంది. వాళ్ల‌తో గడిపిన మధుర క్షణాలు తరుచూ గుర్తుకొస్తూ వారిని మరిచిపోకుండా చేస్తాయి. ఇంగ్లాండ్‌లోని సర్రేకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి కూడా తనకు ఎంతో ఇష్టమైన పిల్లి చనిపోవడంతో.. ఎప్పుడూ దాన్నే తలచుకుంటూ బాధపడేది. ఈ క్రమంలోనే ఆ చిన్నారి.. స్వర్గంలో ఉన్న పిల్లికి లేఖ కూడా రాసింది. కాగా, ఆ లేఖకు బదులిస్తూ.. బోలెడన్ని బహుమతులు రావడం విశేషం.

ఐదేళ్ల చిన్నారి నెవీ లోయ్.. ఓ బుజ్జి పిల్లిని పెంచుకుంది. దానికి ‘టిన్ టిన్’ అని పేరు పెట్టి, ప్రతిరోజూ దానితో హ్యాపీగా గడిపేసేది. కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ఆ పిల్లి చనిపోవడంతో నెవీ ఎంతో ఏడ్చింది. చాలారోజులు ఆ ఆలోచనల్లోంచి బయటకు రాలేదు. అయితే, చనిపోయిన వాళ్లు సాధారణంగా స్వర్గానికి వెళ్తారని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలను నిజమనుకున్న నెవీ.. తన ప్రియమైన టిన్ టిన్.. స్వర్గంలో ఎలా ఉందో? ఏం చేస్తుందో? అని తెలుసుకునేందుకు అక్కడికి లెటర్ రాసింది. అప్పటికీ ఆ చిన్నారి తల్లి తమారా.. తనతో ‘స్వర్గం’ చాలా దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడకు లేఖ రాయడం అసాధ్యమని తెలిపింది. అయినా, ఆ చిన్నారి వింటే కదా! లెటర్ రాయడంతో పాటు అడ్రస్‌లో ‘టిన్ టిన్ – మేఘాల్లో అన్నిటికంటే ఎక్కువ మెరిసే నక్షత్రం’ అని రాసి.. హెవెన్ అని పెట్టింది.

ఆ లేఖలో.. ‘ఐ మిస్ యూ సో మచ్.. యూ ఆర్ ది బెస్ట్ క్యాట్ ఇన్ ద వరల్డ్.. ఐ లవ్ యూ’ అంటూ రాసింది. ఆ లెటర్‌ను కాస్త పోస్ట్ బాక్స్‌లో వేసింది. ఆశ్చర్యంగా.. ఓ వారం తర్వాత నెవీ కొన్ని బహుమతులు అందుకుంది. ఎలాగంటే ఈ మొత్తం విషయాన్ని నెవీ తల్లి ఫేస్‌బుక్‌లో వివరించింది. దీంతో పోస్ట్ ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి.. నెవీ లెటర్‌కు రిప్లయ్ ఇవ్వడమే కాకుండా గిప్ట్స్ కూడా పంపించాడు. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి.. నెవీకి రాసిన లేఖలో.. ‘నాకు లేఖ పంపించినందుకు ఎంతో సంతోషం, మనిద్దరి ఫొటో అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆ ఫొటోను నా పక్కనే పెట్టుకున్నాను. నేను బాగున్నాను. నాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను నీతో లేనందుకు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు.. కానీ, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నాతో మాట్లాడాలనిపిస్తే.. రాత్రి వేళలో ఆకాశంలోని బ్రైటెస్ట్ స్టార్‌ను చూడు.. అది నేనే. నీతో మాట్లాడేందుకు వెయిట్ చేస్తుంటాను. నీ మాటలను వింటాను. ఫరెవర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.. టిన్ టిన్’ అని రిప్లయ్ ఇచ్చాడు.

ఇక టిన్ టిన్ నుంచి లెటర్ వచ్చినప్పటి నుంచి నెవీ హ్యాపీగా ఉంటోంది. ‘మళ్లీ మామూలుగా నిద్రపోతోంది. టిన్ టిన్ బాగుందని తెలియడంతో.. అన్నం సరిగానే తింటోంది. ప్రతిరోజూ రాత్రి.. ఆకాశం వైపు చూసి గుడ్‌నైట్ చెబుతోంది. టిన్ టిన్ కూడా నెవీని చూసి.. తనకు గుడ్ నైట్ చెబుతాడని భావిస్తోంది’ అని నెవీ తల్లి తమారా చెప్పింది.

Read Also..

బిహార్‌లో మరో మాంఝీ..

Advertisement

Next Story