నాజూకు నడుము కోసం..

by sudharani |   ( Updated:2021-06-23 06:40:01.0  )
నాజూకు నడుము కోసం..
X

శరీరబరువు అదుపులో ఉండాలంటే ఆహార నియమాలతో పాటు, అనేక కఠిన వ్యాయమాలు చేయాల్సిందే. వీటిలో ముఖ్యమైనది పొట్టదగ్గర పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం. అధికబరువుతో బాధపడేవారు ఈ కొవ్వును కరిగించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ముఖ్యంగా చాలా మంది మహిళలు ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోతుంటారు. అయితే, ఈ కొవ్వును తొలగించడం పెద్ద కష్టమేం కాదు. సులభమైన సీతాకోకచిలుక ఆసనం ద్వారా సులభంగా కరిగించుకోవచ్చు.

ఈ ఆసనం ఎలా వేయాలంటే..

– ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి.
– అనంతరం రెండు పాదాలను ఎదురెదురుగా ఒకదానితో ఒకటి ఆనించుకుని, కాలి వేళ్లను పట్టుకోవాలి.
– తర్వాత మోకాళ్లను పైకి కిందకు కదుపుతూ ఉండాలి.
– ఇలా క్రమం తప్పకుండా రోజూ 20సార్లు ఈ ఆసనం చేస్తే, శరీరం చురుగ్గా మారుతుంది.
– పొట్ట, తొడల దగ్గరున్న కొవ్వు కరిగిపోతుంది. నడుము సన్నగా మారుతుంది.

ఆ ప్రదేశాల్లో నలుపు తగ్గాలంటే ఇలా చేయండి

Advertisement

Next Story

Most Viewed