మర్రిగూడలో 5 కరోనా పాజిటివ్ కేసులు

by Shyam |
మర్రిగూడలో 5 కరోనా పాజిటివ్ కేసులు
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా 54 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ రాజేష్ తెలిపారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులలో ఇద్దరు కొట్టాల, మరో ఇద్దరు లెంకలపల్లి, ఒకరు రాంరెడ్డిపల్లికి చెందినవారిగా వైద్యాధికారి ప్రకటించారు. బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ చేసే పనిలో అధికారులు పడ్డారు.

Advertisement

Next Story