తెలంగాణలో 45 వేలకు పైగా కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో 45 వేలకు పైగా కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గక కరోనా తన ఉనికిని చాటుతోంది. ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తెలంగాణలో 1296 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 45,076కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం 415 మరణాలు నమోదు అయ్యాయి. వైరస్ నుంచి ఆదివారం 1831 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 32,438 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12, 224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా వ్యాధి సోకిన వారిలో 72 శాతం మంది కోలుకోగా.. ఇంకా 27 శాతం బాధితులు ఉన్నారని.. ఒక్క శాతం మాత్రమే మరణాలు నమోదు అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story