45 మందికి కరోనా నెగెటివ్

by Shyam |   ( Updated:2020-03-04 02:05:19.0  )
45 మందికి కరోనా నెగెటివ్
X

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో నిన్న(మంగళవారం) పరీక్షించిన 47 మంది కరోనా అనుమానితుల్లో 45మంది రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయి. మిగిలిన ఇద్దరి నివేదికలు రావాల్సి ఉంది. వీరి శాంపిళ్లను పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్టు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి కాగా, మరొకరు కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. వీరి రిపోర్టులు రేపు రానున్నాయి. నెగటివ్‌ రిపోర్టులు వచ్చిన 45మందిని గాంధీ నుంచి డిశ్చార్జ్ చేసి, 14రోజులపాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Tags: corona, virus, covid-19, sample, test reports, gandhi hospital, italy, pune

Advertisement

Next Story