- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూమిపై 45 ఫీట్ల మంచుపర్వతం ఎక్కడో తెలుసా..?
దిశ, ఫీచర్స్ : మంచు గడ్డకట్టి, భూమిపై భిన్న ఆకృతులుగా ఏర్పడటం సహజమే. కానీ, భూమిపైన 45 ఫీట్ల ఎత్తు వరకు మంచు పేరుకుని ఓ పర్వతం వలె ఏర్పడటం మాత్రం అరుదు. తాజాగా అలాంటి భిన్న ఆకృతి ఒకటి వెలుగు చూడటం విశేషం. కజకిస్థాన్ దేశం, అల్మాటి ప్రాంతంలోని కెగన్, శ్రగనక్ గ్రామాల మధ్య ఉండే ప్లేస్‌లో ఈ తరహా ఆకృతి ఏర్పడింది. అయితే కఠినమైన శీతాకాల వాతావరణం వల్ల భూగర్భజలం ఉబికి వచ్చి మంచు ఇలా ఏర్పడి ఉండొచ్చని పలువురు అంటున్నారు. ఇక అగ్నిపర్వతం నుంచి వెలువడే లావా మాదిరిగా, ఈ మంచు పర్వతంపై నుంచి నీరు కొద్ది కొద్దిగా పైకి వస్తుండటంతో ఈ దృశ్యాన్ని తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. కాగా, ఇంత ఎత్తుతో మంచు పర్వతం మాదిరి ఏర్పడటం ఇదే మొదటిసారని స్థానికులు చెప్తున్నారు. గతేడాది ఇలాంటి ఓ మంచు ఆకృతి ఏర్పడిందని, అయితే అది చాలా చిన్నదని పేర్కొన్నారు. కజకిస్థాన్‌లోని ఈ ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం పలువురు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. తప్పకుండా ఈ సుందర దృశ్యాలను ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.