- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కరోనా కొత్త కేసులు 43
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో 31 హైదరాబాద్ నగరానికి చెందినవే. గద్వాల జిల్లాలో ఒకేరోజు ఏడు కొత్త కేసులు పుట్టాయి. గడచిన వారం రోజుల్లో 300 కేసులు కొత్తగా పుట్టుకొచ్చాయి. గత శనివారం (ఏప్రిల్ 11వ) రాత్రి 10 గంటలకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 503 ఉంటే వారం రోజుల తర్వాత అది 809కు చేరుకుంది. ఏడురోజుల వ్యవధిలో 306 కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 55 మినహా మిగిలినవన్నీ మర్కజ్ వ్యవహారంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడినవే. గద్వాలలో శనివారం నమోదైన కొత్త కేసులు కూడా దానికి సంబంధించనవేనని జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ సిరిసిల్లలో ఒకే ఒక కేసు ఉంటే తాజాగా రెండు కొత్త కేసులు వచ్చాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో 460కు పైగా హైదరాబాద్ నగరానికి చెందినవే. తాజాగా ఉనికిలోకి వచ్చిన 43 కేసుల్లో సైతం మూడొంతులు ఈ నగరం నుంచే నమోదుకావడం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో సైతం దాదాపు మూడింట రెండొంతులు నగరంలోనే ఉన్నాయి.
హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా రాష్ట్రం మొత్తంమీద ప్రభుత్వం ఏర్పాటుచేసిన కంటైన్‌మెంట్ క్లస్టర్లలో దాదాపు సగం ఇక్కడే ఉన్నాయి. నగరంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రమే కాక ముఖ్యమంత్రి సైతం ఆందోళనతో ఉన్నారు. అందుకే కంటైన్‌మెంట్ క్లస్టర్లలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వస్తున్న కేసులను దృష్టిలో పెట్టుకుని అధికారులు సైతం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే సుమారు 130 కంటైన్‌మెంట్ క్లస్టర్లను నెలకొల్పి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా సీల్ చేసిన అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం ఆదివారం నుంచి ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేయాలనుకుంటున్నారు. రాష్ట్రంలో మరే జిల్లాకంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండడం, మృతుల్లో సైతం నగరానికి చెందినవారే ఎక్కువగా ఉండడం గమనార్హం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఇంతకాలం చాలా గర్వంగా చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు కరోనా కారణంగా అప్రతిష్టను మూటగట్టుకుందనే ఆందోళన సైతం పార్టీ నేతల్లో, పట్టణాభివృద్ధి శాఖ, జీహెచ్ఎంసీ అధికారుల్లో నెలకొనింది.
Tags: Telangana, Corona, Hyderabad, Positive Cases, Containment Clusters