- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో 40 డెల్టా ప్లస్ కేసులు
న్యూఢిల్లీ: అత్యంత వేగంతో వ్యాపించే కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో 40కు చేరినట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లలో అక్కడక్కడ ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు 45వేల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేశామని, వీటి ద్వారా ఈ మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నట్టు తేలిందని వివరించింది. అయితే, దాని విజృంభణ ఉన్నట్టు సంకేతాలు లేవని పేర్కొంది. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లో కట్టడి చర్యలు పటిష్టం చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.
తమిళనాడు, కర్ణాటకలోనూ డెల్టా ప్లస్
కేంద్ర ప్రభుత్వం ఆందోళనకరమైన వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్లస్ వేరియంట్ తాజాగా, తమిళనాడు, కర్ణాటకలోనూ బయటపడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులున్నట్టు ఆ ప్రభుత్వాలు వెల్లడించాయి. చెన్నైకు చెందిన ఓ నర్సుకు డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్టు తేలిందని రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ డాక్టర్ జే రాధాక్రిష్ణన్ వెల్లడించారు. మొత్తం 1,159 కేసుల శాంపిళ్లను మే నెలలో 28 ల్యాబ్‌ల కన్సార్టియానికి పంపించామని, ఇందులో 772 కేసుల ఫలితాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కాగా, కర్ణాటకలోనూ రెండు డెల్టా ప్లస్ వేరియంట్‌ల కేసులను అధికారులు ధ్రువీకరించారు. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ఈ వేరియంట్ కేసులున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.