గాంధీ ఆస్పత్రిలో నలుగురు ఖైదీల పరారీ..

by Shyam |
గాంధీ ఆస్పత్రిలో నలుగురు ఖైదీల పరారీ..
X

దిశ, వెబ్‌డెస్క్ :

గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన నలుగురు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా తప్పించుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి కొవిడ్-19 చికిత్స కోసం వచ్చిన ఖైదీలు గురువారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతాల్లో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

గాంధీ ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి వీరు పారిపోయినట్లు తేలింది. పరారీలో ఉన్న ఈ నలుగురు ఖైదీల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వీరు ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతుండటంతో వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story