- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
33 శాతం ఉద్యోగులు సచివాలయానికి రావాల్సిందే: నీలం సహానీ
కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటూ సీఎస్ నీలం సహానీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం సహాయ కార్యదర్శి, ఆపైస్థాయి అధికారులు విధులకు హాజరుకావాల్సిందేనని చెప్పారు. వారికి ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశారు. సహాయ కార్యదర్శి స్థాయి దిగువ ఉద్యోగులు డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల్లో 33 శాతం మంది కచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, ఊపిరి సంబంధిత ఇబ్బందులు, కిడ్నీకి కీమోథెరపీ చేయించుకోవాల్సిన వారు, రోగనిరోధక శక్తి పెంచుకునే చికిత్స తీసుకునేవారిని విధుల నుంచి తప్పించే అధికారం సంబంధిత శాఖ కార్యదర్శికి వదిలేశారు. గర్భణి ఉద్యోగులు ఇంటి వద్దే ఉండటం మంచిదని ఈ ఉత్తర్వుల్లో సూచించారు. అదే సమయంలో 33 శాతం సిబ్బంది వ్యక్తిగత రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.
Tags: corona virus, ap assembly, sachivalayam, employees