లారీని ఢీకొన్న పెండ్లి బస్సు.. వధూవరులతో సహా 30 మంది..

by Sridhar Babu |   ( Updated:2021-08-15 22:48:44.0  )
marriage bus accident
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పటి వరకు ఎంతో సందడిగా ఉన్న పెండ్లి బస్సు.. నవవధూవరులు మొహాల్లో సిగ్గు, బంధువుల ఆనందహేళ, చిన్నారుల నవ్వులు.. కానీ ఒక్కసారిగా ఆ సందడి అంతా విషాదంగా మారిపోయింది. నిద్రమత్తులో డ్రైవర్ చేసిన చిన్నతప్పు రోడ్డు ప్రమాదానికి దారితీసింది. అయితే ఈ ప్రమాదంలో అందరు గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన యువకుడికి చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. ఆదివారం వధువు ఇంటివద్ద జరిగే విందుకు వరుడు తరపు బంధువులు 50 మంది కలిసి కూకట్‌పల్లి డిపో బస్సులో తరలివెళ్లారు. విందు ఆరగించి తిరిగి వెదురుగట్ట నుంచి హైదరాబాద్‌ కు బస్సు బయల్దేరింది. సుమారు అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఇందిరానగర్‌ వద్ద బస్సు ముందు వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వరుడు, వధువుతోపాటు సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed