- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భేష్… ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు 3 ప్రపంచ రికార్డులు
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : వంద సంవత్సరాలకు పైగా చరిత్ర గలిగిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మూడు ప్రపంచ రికార్డులలో చోటు దక్కించుకుంది. ఈ మేరకు నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకుని గురువారం ఉదయం ఆయా ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కె.వి.రమణారావు వివరాలు వెల్లడించారు. వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్, డాక్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి మూడు ప్రపంచ రికార్డులలో నమోదు చేసిన ధృవపత్రాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కు అందించనున్నట్లు చెప్పారు. ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కె. వి. రమణారావు తదితరుల చేతుల మీదుగా రికార్డులకు సంబంధించిన పత్రాలు డాక్టర్ నాగేందర్ అందుకోనున్నారు.
డాక్టర్ నాగేందర్ కు ప్రశంసలు…
ఉస్మానియా ఆస్పత్రికి మూడు ప్రపంచ రికార్డులు దక్కడంతో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ను పలువురు ప్రశంసించారు. ఆస్పత్రిలో సమస్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందునే అవార్డులు వాటంతట అవి వస్తున్నాయని హాస్పిటల్‌లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది కొనియాడారు.