- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మూడు హత్యలను ఛేదించారు ఇలా..
దిశ, వెబ్‌డెస్క్: దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా దూసుకుపోతున్న పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. కేవలం కుటుంబం పరువు కోసం ఎక్కడో చోట ఈలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత మంచి వ్యవస్థలు ఉన్నా కూడా వాటికి సైతం దొరకకుండా పరువు హత్యలు జరగడం మన ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అయితే, తప్పు చేసినవాడు చట్టం దృష్టిలో నుంచి ఎప్పుడూ తప్పించుకోలేడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరోక తప్పు చేస్తూ పోలీసులకు దొరికిపోతుంటారు. నేరాలు చేయడంలో ఎంతటి ఘనాపాటి అయినా ఏదొక తప్పు చేసి ఊచలు లెక్కించాల్సిందే. ముఖ్యంగా మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరువు హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మధ్య ఇలాంటి పరువు హత్య ఒకటి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యూపీలోని సంబల్ జిల్లా గదా గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరు కొన్ని రోజులు కలిసి బయటకు వెళ్లారు. ఈ విషయం యువతి అన్నకు తెలిసింది. తన చెల్లెలి ప్రేమ వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన అతడు తన స్నేహితులు ముగ్గురికి సుపారీ ఇచ్చి సోదరిని, ఆమె ప్రియుడిని హత్య చేయించారు. అనంతరం వారి బాడీలను ఊరి బయట ఉన్న చెట్టుకు వేలాడదీశారు. ఎక్కడ వారి ప్రేమ బయటకు తెలిస్తే పరువు పోతుందో అని భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. ఇది జరిగిన వారానికి అదే చెట్టుకు మరొక వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. మరణించిన సోదరికి మరో సోదరుడు అతను. ఈ ఘటన పోలీసులకు అనుమానం కలిగించింది. పోస్ట్ మార్టం రిపోర్టులో అది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది. దీంతో ఆ యువతి అన్నను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ప్లాన్ చేసిన అన్నతో పాటు, హత్యకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.