- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటలూ కంట్రోల్ రూం
దిశ, న్యూస్ బ్యూరో:
కోవిడ్ -19 నివారణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో అన్నిశాఖల అధికారులతో కలిపి ఉండేలా 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని మంగళవారం ఆదేశించింది. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వాటర్ బోర్డు, మెట్రో విభాగాలు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేసింది. బల్దియా కార్యాలయాల ఎంట్రన్స్‌ల వద్ద శానిటైజర్లు, హ్యాండ్‌వాష్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ నెల 31 వరకూ సందర్శకులను కార్యాలయాల లోపలకి అనుమతించడంలేదని సూచించేలా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత కార్యాలయాల్లో సమాచారం, వివరాల కోసం ప్రజలు సంప్రదించాల్సిన అధికారుల కాంటాక్ట్ వివరాలను ఆఫీస్ గేటు ముందే అంటించాలని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం వచ్చే వారు వేచి ఉంచేందుకు ఐదు అడుగుల దూరం ఉండేలా బాక్స్‌లు మార్క్ చేయాలని అందులో పేర్కొన్నారు. 31వ తేదీ వరకు ఫీల్డ్, కార్యాలయంలో ఉండే అధికారుల, సిబ్బంది వివరాలతో జాబ్ చార్ట్‌లను ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రదర్శించాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. ఉద్యోగులందరికీ ఏప్రిల్ మొదటి తేదీన వేతనాలు కచ్చితంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. పట్టణాలు, నగరాల్లో శానిటేషన్ పరిరక్షణ, నీటి సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో సూచించారు.
Tags: Telangana, Latest, Hyderabad