సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ర్యాంకుల పంట

by srinivas |
సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ర్యాంకుల పంట
X

దిశ, వెబ్ డెస్క్: యూపీఎస్‌సీ విడుదల చేసిన సివిల్స్-2019 ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు ర్యాంకుల పంట పండించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 23 మంది విద్యార్థులు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుంచి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన పి. ధాత్రిరెడ్డి 46 వ ర్యాంకుతో టాప్ 50లో నిలిచారు. మల్లవరపు సూర్యతేజ(76), కట్టా రవితేజ(77), సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి(95), ఎంవీ సత్యసాయి కార్తీక్(103), మకరంద్(110), తాటిమాకుల రాహుల్ రెడ్డి(117), ప్రేమ్ సాగర్(170), పిన్నాని సందీప్ వర్మ(244), శ్రీచైతన్య కుమార్ రెడ్డి(250), చీమల శివగోపాల్ రెడ్డి(263), యలవర్తి మోహన్ కృష్ణ(283), ఎ.వెంకటేశ్వర్ రెడ్డి(314), సిరిశెట్టి సంకీర్త్(330), ముత్తినేని సాయితేజ(344), ముక్కెర లక్ష్మీపావన గాయత్రి(427), కొల్లాబత్తుల కార్తీక్(428), ఎన్.వివేక్ రెడ్డి(485), నీతిపూడి రష్మితారావు(534), కోరుకొండ సిద్ధార్థ(566), సి.సమీర్ రాజా(603), కొప్పిశెట్టి కిరణ్మయి(633) ర్యాంకు సాధించారు. కాగా, దేశవ్యాప్తంగా 829 మంది సివిల్స్‌కు ఎంపిక కాగా, మొదటి ర్యాంకును హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ కైవసం చేసుకున్నాడు. రెండు, మూడు స్థానాల్లో జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed