- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇన్‌స్టా, టిక్‌టాక్, యూట్యూబ్ యూజర్ల డేటా లీక్
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ నెటిజన్ల డేటా లీకవడం కామన్‌గా మారిపోయింది. నెట్టింట్లో బోలెడన్నీ అకౌంట్లు ఓపెన్ చేస్తుంటాం. సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లు మార్చుతుంటాం. 2 స్టెప్ వెరిఫికేషన్ చేస్తుంటాం. ఇదంతా మన వైపు. కానీ, నెటిజన్లు ఉపయోగించే అనేక సర్వీస్‌లలోని డేటాకు మాత్రం భద్రత లేకుండా పోయింది. గతంలో ఫేస్‌బుక్ యూజర్ల డేటా పలు మార్లు లీకవ్వగా..ఇప్పుడు తాజాగా ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టిక్‌టాక్ యూజర్ల డేటా లీకైంది. మొత్తం 23.5 కోట్ల మంది యూజర్ల డేటా లీకైనట్లు వెల్లడైంది.
కామ్‌పారిటెక్ కంపెనీకి చెందిన రీసెర్చ్ టీమ్ అందించిన వివరాల ప్రకారం..ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టిక్‌టాక్ యూజర్లకు చెందిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పేర్లు, ఇమేజ్‌లు, ఇతర వివరాలు లీకయ్యాయి. ఈ మూడు సోషల్ మీడియా సైట్‌ల నుంచి 23.5 కోట్ల యూజర్ల డేటా లీకవగా, అందులో ఇన్‌స్టాగ్రామ్ నుంచి అత్యధికంగా 100 మిలియన్లకు పైగా డేటా లీకైంది. టిక్ టాక్ నుంచి 42 మిలియన్లు, యూట్యూబ్ నుంచి 4 మిలియన్ల మంది డేటా పోయింది. ఈ డేటాను డీప్ సోషల్ అనే కంపెనీ లీక్ చేసినట్లు తెలుస్తోంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన సోషల్ డేటా అనే కంపెనీకి డీప్ సోషల్‌తో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ డేటా స్పందించింది. డేటా లీక్ అయిన మాట వాస్తవమేనని..కానీ, డేటాను సేకరించడాన్ని ప్రస్తుతం ఆపేశామని ఆ కంపెనీ తెలిపింది. నిజానికి ఇంటర్నెట్‌లో పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండే డేటాను సేకరించడం తప్పేమీ కాదని, అది హ్యాకింగ్ కిందకు రాదని సోషల్ డేటా వ్యాఖ్యానించింది. కాగా, ఇలా సేకరించిన డేటాను ఫిషింగ్ వంటి స్కాంలకు ఉపయోగిస్తారు. అందువల్ల ఈ విషయం నెటిజన్ల భద్రతకు ముప్పును కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, ఎంగేజ్‌మెంట్ రేట్, ఫాలోవర్స్ గ్రోత్ రేట్, ఆడియన్స్ జెండర్, ఆడియన్స్ ఏజ్, ఆడియన్స్ లోకేషన్, లైక్స్ , ఏజ్, జెండర్ , లాస్ట్ పోస్ట్ టైమ్ స్టాంప్ తదితర వివరాలు స్పామర్స్, సైబర్ క్రిమినల్స్‌కు ఎంతో ముఖ్యమైనవి. వీటిని బేస్ చేసుకుని ఫిషింగ్ అటాక్ చేయవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఆగస్ట్ మొదటి వారంలో షైనీ హంటర్స్ అనే హ్యాకర్స్ గ్రూప్ 18 కంపెనీలకు చెందిన 386 మిలియన్ల మంది డేటాను దొంగలించింది. వీటిని ఎవరైనా ఉచితంగా తీసుకోవచ్చని కూడా తెలిపింది.