ఆమెకు 41, అతడికి 21.. ఆంటీ ఇంట్లో కుర్రాడిని చూసి..

by Anukaran |   ( Updated:2021-08-20 06:44:44.0  )
ఆమెకు 41, అతడికి 21.. ఆంటీ ఇంట్లో కుర్రాడిని చూసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ గుడ్డిది అంటారు కదా.. అలాంటి ఘటనే ఒకటి తాజాగా సంచలనంగా మారింది. 41ఏళ్ల మహిళ, 21ఏళ్ల యువకుడి ప్రేమాయణం బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఖగడియా జిల్లా పంచ్​కుటీ మండలం దరియాపుర్ పంచాయతీ పరిధిలోని నయాగావ్‌కు చెందిన మనతి దేవి(41)కి జోరావర్‌పూర్‌కు చెందిన రవి కుమార్(21)తో పరిచయం ఏర్పడింది.

అయితే, మనతి దేవీ భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా ఆమెకు నలుగురు పిల్లలున్నారు. ఈ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రవికుమార్.. మనతి దేవి ఇంటికి తరచుగా వెళ్తు ఉండేవాడు. అయితే ఆగస్టు 16న సాయంత్రం.. రవికుమార్.. మనతి ఇంట్లో ఉండటం గ్రామస్థుల కంట పడింది.

దీంతో వారు రవికుమార్‌ను పట్టుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో దరియాపూర్ సర్పంచ్ శంబు సింగ్, జోరావర్‌పూర్ సర్పంచ్ పంకజ్ షా.. మనతి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇద్దరు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు కలిసి వారిని నిలదీశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నట్టు తెలిపారు. తాము వివాహం చేసుకుంటామని తెలపడంతో ఊరి పెద్దలు వారికి వివాహం చేశారు.

ఈ నేపథ్యంలోనే మొత్తం నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను కొత్త జంట వద్ద, మరో ఇద్దరిని మనతి తల్లి వద్ద ఉంచేలా పెద్దలు అంగీకారం కుదిర్చారు. వివాహం జరిగిన తర్వాత గ్రామస్తులు రవికుమార్ వెంట మనతిని పంపించారు. ఈ విషయంతో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read more

బయటపడిన 250 నగ్న వీడియోలు.. అందులో 100 బాలీవుడ్ తారలవే.

ప్రభుత్వ వైద్యుడి పైశాచికత్వం.. బాతురూంలో నర్స్ నగ్న వీడియోలు తీసి.

Advertisement

Next Story

Most Viewed