నాగ సొరకాయకు రూ.2కోట్లు

by Anukaran |   ( Updated:2020-10-12 09:33:03.0  )
నాగ సొరకాయకు రూ.2కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భక్తుల నమ్మకం రూ. లక్ష నుంచి రూ. 2 కోట్లు పలికింది. భక్తితో వస్తే అదే అదునుగా కోట్ల రూపాయలు దండుకున్నారు. రూ. 10 విలువ చేసే సొరకాయ పేరుతో కోట్లు దోచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను పలువురు కేటుగాళ్లు బురిడి కొట్టించాడు. ఏకంగా శ్రీశైలంలో ఓ ఆశ్రమం నడిపిస్తూ.. నాగ సొరకాయల దందా మొదలుపెట్టారు. నల్లమల్ల అడవుల్లో దొరికే నాగ సొరకాయ నినాదంతో 21 మంది నిందితులు భక్తులను ఆకర్శించారు. ఆ తర్వాత వారి స్థోమతను బట్టి సొరకాయలను అమ్మారు. రూ. లక్ష నుంచి మొదలైన సొరకాయ బిజినెస్ చివరకు రూ. 2 కోట్లు కూడా పలకడం గమనార్హం.

ఈ వ్యవహారం తెలుసుకున్న ఆత్మకూర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయల్లో సొరకాయలు అమ్మినట్టు కేటుగాళ్లు ఒప్పుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, నాగ సొరకాయ పేరిట జరిగే మోసాల పై భక్తుల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed