India ODI World Cup 2023 schedule : టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే..

by Vinod kumar |   ( Updated:2023-06-30 13:11:37.0  )
India ODI World Cup 2023 schedule : టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. World Cup 2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. 2011లో వరల్డ్ కప్ గెలిచిన భారత్.. ఆ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

అయితే ఈ టోర్నీలో భారత జట్టు మొత్తం 9 మ్యాచులు ఆడనుంది. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన స్టేడియాల్లో హైదరాబాద్ మినహా అన్ని వేదికల్లో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 8న తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొంటుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత 11వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొంటుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. ఆ తర్వాత 18న పూణేలో బంగ్లాదేశ్‌, 22న ధర్మశాలలో న్యూజిల్యాండ్, 29న లక్నోలో ఇంగ్లండ్, నవంబర్ 2న ముంబైలో క్వాలిఫైయర్-2, నవంబర్ 5న కోల్‌కతాలో సౌతాఫ్రికా, నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫైయర్-2తో భారత్ ఆడుతుంది.

టీమ్ ఇండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..

అక్టోబర్‌ 8: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా (చెన్నై)

అక్టోబర్‌ 11: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (ఢిల్లీ)

అక్టోబర్‌ 15: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (అహ్మదాబాద్‌)

అక్టోబర్‌ 19: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (పూణే)

అక్టోబర్‌ 22: ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ధర్మశాల)

అక్టోబర్‌ 29: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (లక్నో)

నవంబర్‌ 2: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-2 (ముంబై)

నవంబర్‌ 5: ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా (కోల్‌కతా)

నవంబర్‌ 11: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-1 (బెంగళూరు)

నాకౌట్‌ మ్యాచ్‌ల షెడ్యూల్..

నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)

నవంబర్‌ 16: సెమీఫైనల్‌-2 (కోల్‌కతా)

నవంబర్‌ 19: ఫైనల్‌ (అహ్మదాబాద్‌)

Advertisement

Next Story

Most Viewed