ICC World Cup 2023: భారత్‌ తరఫున ఎక్కువ వరల్డ్‌ కప్‌ టోర్నీలు ఆడిన క్రికెటర్‌ ఎవరో తెలుసా..?

by Vinod kumar |   ( Updated:2023-10-01 11:35:47.0  )
ICC World Cup 2023: భారత్‌ తరఫున ఎక్కువ వరల్డ్‌ కప్‌ టోర్నీలు ఆడిన క్రికెటర్‌ ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023 మరో నాలుగు రోజల్లో స్టార్ట్ కానుంది. అక్టోబర్‌ 5న డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో వరల్డ్ కప్‌ పోరు మొదలవనుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియా టీమ్‌తో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో అత్యధిక వరల్డ్‌ కప్‌లు ఆడిన క్రికెటర్‌ ఎవరు అనే విషయం చర్చకు వచ్చింది.

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటికే మూడు వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆడబోయేది ఆయనకు నాలుగో వరల్డ్‌ కప్‌. విరాట్ కంటే ముందు భారత మాజీ క్రికెట్‌ దిగ్గజాలు సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌, ఎంఎస్‌ ధోనీ నాలుగేసి వరల్డ్‌ కప్‌లు ఆడారు. ఈ వరల్డ్‌ కప్‌తో కోహ్లీ కూడా వారి జాబితాలో చేరబోతున్నాడు. అందరికంటే ఎక్కువగా వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఆడిన క్రికెటర్‌ ఎవరనే విషయానికి వస్తే సచిన్‌ టెండూల్కర్‌ అని స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే సచిన్ ఇప్పటి వరకు మొత్తం 6 వరల్డ్‌ కప్‌ టోర్నీలు ఆడాడు. వరుసగా 1992, 1996, 1999, 2003, 2007, 2011 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లలో సచిన్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Advertisement

Next Story

Most Viewed