ICC World Cup 2023: నెదర్లాండ్స్‌పై పాక్ విజయం..

by Vinod kumar |   ( Updated:2023-10-10 13:11:19.0  )
ICC World Cup 2023: నెదర్లాండ్స్‌పై పాక్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులకు అలౌట్ అయింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ ఓపెనర్లలో.. విక్రమ్ జిత్ సింగ్ 52, బాస్ డీ లీడే 67, లగాన్ వాన్ బీక్ 28 పరుగులతో పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు క్రీజ్ ముందు నిలవలేక పోయారు. ఫలితంగా 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో నెదర్లాండ్స్ కథ ముగిసింది. పాక్ బౌలర్లలో.. హరిస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా.. హసన్ అలీ 2, షాహీన్ షా అఫ్రిది, ఇఫ్లికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. దీంతో నెదర్లాండ్స్ మీద పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఓపెనర్లు ఫఖర్ జమాన్ 12, ఇమాం ఉల్ హక్ 15 పరుగులకు, సారధి బాబర్ ఆజం ఐదు పరుగులకే పెవిలియన్ దారి పట్టినా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మద్ రిజ్వాన్ 68, షౌద్ షకీల్ 68 పరుగులతో రాణించారు. మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డే లీడే 4 వికెట్లు తీయగా.. కలిన్ అకర్ మాన్ 2, ఆర్యన్ దట్, లోగాన్ బెర్క్, పాల్ వాన్ మీకెరెన్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story