ICC World Cup 2023 Warm Up Match: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్‌..

by Vinod kumar |   ( Updated:2023-10-03 12:44:53.0  )
ICC World Cup 2023 Warm Up Match: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. రిజ్వాన్‌ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్‌ అయ్యాడు. రిజ్వాన్‌తో పాటు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా రాణించాడు. బాబర్‌ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్‌లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 257/4గా ఉంది. సౌద్‌ షకీల్‌ (36), అఘా సల్మాన్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ 3, సకీబ్‌, షొరీఫుల్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed