Foreign Education : బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా? కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

by Ramesh N |   ( Updated:2024-10-09 06:59:30.0  )
Foreign Education : బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా? కేటీఆర్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అర్హులైన పేద బీసీ విద్యార్థులకు చేయూత అందించేందుకు ఉద్దేశించిన మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య పథకం అమలుపై సందిగ్ధం ఏర్పడింది. మిగతా సంక్షేమ శాఖలు జాబితాలు వెల్లడిస్తున్నా.. బీసీ సంక్షేమశాఖలో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. 2023 సీజన్‌కు విదేశీ విద్య పథకం కింద స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయి దాదాపు ఏడాది గడుస్తున్న అర్హుల జాబితాను ప్రకటించలేదు.

ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా? నాడు కేసీఆర్‌తో సాధ్యం నేడు అసాధ్యం-పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటం’ అంటూ విమర్శలు చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ముగుస్తున్న కోర్సులు-అప్పుల్లో తల్లిదండ్రులు- సాగదీస్తున్న అధికారులు.. దరఖాస్తు చేసుకుని ఏడాది అవుతున్నా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అని ప్రశ్నించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను రేవంత్ సర్కార్ అంధకారంలోకి నెట్టిందన్నారు. తక్షణమే ఆ జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed