- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Alekhya Reddy: తారకరత్న పిల్లలపై నెటిజన్ దారుణ పోస్ట్.. అలేఖ్య రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో తారకరత్న గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆయన భార్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఆవేదనను వ్యక్త పరుస్తోంది. అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతోంది. ఈ క్రమంలో.. ఓ నెటిజన్ తన పిల్లలను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘పనేం లేదు. ఒక్కరితో ఆపేయకుండా ఇంత మంది ఎందుకు, అసలు నందమూరి ఫ్యామిలీ చేసిన తప్పే అంతమందిని కనడం’’ అని రాసుకొచ్చాడు.
అంతేకాకుండా వారి స్కిన్ టోన్ గురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. తాజాగా, దీనిపై అలేఖ్య ఇన్‌స్టా వేదికగా రియాక్ట్ అయింది. ‘‘ఎవరి పిల్లలైనా సరే వారి స్థాయిని, బ్యాక్ గ్రౌండ్‌ను చూడకుండా అందరినీ సమానంగా చూడాలి. అలాగే పిల్లలకు ప్రేమను పంచాలి. చిన్నారులపై ద్వేషాన్ని చూపించకుండా వారికి హాని చేయాలని అనుకోకూడదు. నెగెటివిటీ ద్వేషం కంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. సమాజంలో ప్రేమను పంచే తత్వాన్ని పెంచాలి. అందరూ కలిసి పాజిటివ్‌గా ఆలోచిస్తే అలాంటి సమాజాన్ని నిర్మించగలం కాబట్టి దయచేసి అందరూ ప్రేమను పంచండి. ఇలాంటి కామెంట్లు చేయడం కాదు’’ అని రిప్లై ఇచ్చింది.
Also Read: ఆ డైరెక్టర్ ఓ అమ్మాయిని గర్భవతిని చేశాడు.. దుమారం రేపుతున్న పూనమ్ కౌర్ ట్వీట్