రష్మిని కాపాడేందుకు సుడిగాలి సుధీర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anjali |   ( Updated:2024-10-09 08:06:17.0  )
రష్మిని కాపాడేందుకు సుడిగాలి సుధీర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయనడంలో అతిశయోక్తిలేదు. ఈ షో ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. జబర్దస్త్ లో తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పురుషులు అండ్ లేడీ కమెడియన్స్ ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. ఇకపోతే జబర్దస్త్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవారు యాంకర్ రష్మి అండ్ సుడిగాలి సుధీర్. వీరిద్దరి కెమిస్ట్రీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ షోకు మరింత క్రేజ్ సొంతమైందనడానికి ఓ రీజన్ రష్మి-సుధీర్ జోడి అని చెప్పుకోవచ్చు. ఈ జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

అదిరిపోయే డ్యాన్స్, టైమింగ్ పంచులతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్, అండ్ లవ్ ట్రాక్ అయితే జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సుధీర్ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. రష్మీ యాంకర్‌గా కొనసాగుతోంది. సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉన్న ఈ జంట గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ రష్మికి ఒకప్పుడు డబ్బు అవసరం వచ్చిందట. దీంతో వెంటనే సుధీర్‌ను అడిగిందట. వెంటనే సుధీర్ ఆమెకు ఆర్థిక సాయం చేసి ప్రాబ్లమ్ నుంచి బయటపడేశాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది.


👉 Also Read: ఆమెతో సుధీర్ నిశ్చితార్థం.. పదేళ్ల ప్రయాణం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మి

Advertisement

Next Story