ICC World Cup 2023: బాబర్‌ ఆజమ్‌ హాఫ్‌ సెంచరీ..

by Vinod kumar |
ICC World Cup 2023: బాబర్‌ ఆజమ్‌ హాఫ్‌ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్‌ చెలరేగిపోయాడు. భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే బాబర్‌ ఆజమ్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

మరో ఎండ్‌లో మొహమ్మద్‌ రిజ్వాన్‌ సైతం హాఫ్‌ సెంచరీ చేశాడు. రిజ్వాన్‌ 53 బంతుల్లో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్‌ గేమ్‌లో పాక్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం రిజ్వాన్‌ (62), సౌద్‌ షకీల్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed