Virat Kohli: తల బాదుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

by Vinod kumar |
Virat Kohli: తల బాదుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC ODI World Cup 2023లో టీమిండియా బోణీ కొట్టింది. ఆసీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

116 బంతులకు 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. హాజిల్ వుడ్ బౌలింగ్‌లో లబుషేన్‌కి క్యాచ్ ఇచ్చి కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ ఔట‌యిన అనంత‌రం డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఫ్రస్టేషన్‌లో కోహ్లీ తల బాదుకుంటూ కనిపించాడు. ఇలాంటి కీలక సమయంలో అవుటైనందుకు చాలా చికాకు పడిపోయాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story