Shikhar Dhawan: వరల్డ్​కప్​ జట్టుపై గబ్బర్ రియాక్షన్..​ ట్వీట్‌కు ఫ్యాన్స్​ ఫిదా

by Vinod kumar |
Shikhar Dhawan: వరల్డ్​కప్​ జట్టుపై గబ్బర్ రియాక్షన్..​ ట్వీట్‌కు ఫ్యాన్స్​ ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: World Cup 2023 కోసం ఎంపికైన టీమ్​ ఇండియా సీనియర్ ప్లేయయ్ శిఖర్ ​ధావన్‌కు జట్టులో స్థానం దక్కలేదు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు మాజీలు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై తొలిసారి శిఖర్ ధావన్ స్పందించాడు. తనకు టీమ్‌లో చోటు దక్కకపోయినప్పటికీ.. ధావన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. "వెళ్లి మీ ప్రతాపం చూపండి.. ట్రోఫీ గెలవండి" అంటూ రోహిత్​ సేనకు మద్దతిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

"వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కోసం ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్న నా సహచరులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. దేశంలోని 150 కోట్ల మంది ప్రజలు ప్రార్థనలు, మద్దతుతోపాటు మా ఆశలు, కలలను మీరు మోస్తున్నారు. మీరు కప్పు గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతాపం చూపించండి టీమ్ ఇండియా.. చక్ దె ఫట్టే" అంటూ ధావన్ట్వీ ట్​ చేశారు.

Advertisement

Next Story

Most Viewed