టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌కు ప్రధాని మోడీ, అమిత్ షా (వీడియో)

by GSrikanth |
టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌కు ప్రధాని మోడీ, అమిత్ షా (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరల్డ్ కప్ లీగ్ దశలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి, ఇటీవల జరిగిన ఫైనల్లో ఓటమితో తీవ్ర విచారంలో మునిగిపోయిన భారత ఆటగాళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓదార్చారు. నవంబర్ 19న అహ్మదబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి అనంతరం కొందరు భారత క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిన ప్రధాని మోడీ, అమిత్ షా వారితో మాట్లాడి ఓదార్చారు.

భారత్ కెప్టెన్ రోహిత్, కోహ్లీ, ష‌మీ, బుమ్రా సహా ప్లేయర్లందరితో మాట్లాడారు. పేసర్‌ షమీని కౌగిలించుకుని మరీ బాగా ఆడావని కొనియాడారు. ఇలాంటివి జ‌రుగుతుంటాయ‌ని, మ‌నోధైర్యాన్ని కోల్పోవ‌ద్దని సందేశామిచ్చారు. ఫ్రీ అయిన త‌ర్వాత ఓసారి ఢిల్లీకి రావాలంటూ జట్టుకు ఆహ్వానం పంపారు. డ్రెస్సింగ్ రూమ్‌లో మోడీ కలిసిన వీడియో ఇవాళ విడుదల అయ్యింది. తాజాగా నెట్టింట్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed