వరల్డ్ కప్‌పై పాకిస్తాన్ స్పోర్ట్స్ మినిస్టర్ సంచలన కామెంట్స్..

by Vinod kumar |
వరల్డ్ కప్‌పై పాకిస్తాన్ స్పోర్ట్స్ మినిస్టర్ సంచలన కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ మ్యాచ్ ఒక తటస్థ వేదికపై ఆడతామని బీసీసీఐ పట్టుబడితే బాబార్ ఆజామ్ సారథ్యంలోని క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ కోసం భారత్ పర్యటించబోదని పాకిస్తాన స్పోర్ట్స్ మినిస్టర్ ఎహెసాన్ మజారీ సంచలన కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నేను బాధ్యత వహిస్తున్న క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. వరల్డ్ కప్ వేదికపై నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే.. ఒక వేళ ఇండియా వారి ఆసియా కప్ మ్యాచ్‌లు తటస్థ వేదికపైనే ఆడుతామని డిమాండ్ చేస్తే మేము కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇలాంటి డిమాండే చేస్తాం’ అని అన్నారు. బీసీసీఐ ఆసియా కప్ మ్యాచ్‌లకు తటస్థ వేదికకు ప్రణాళికలు వేస్తే మాత్రం పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం భారత దేశంలో పర్యటించబోదని స్పష్టం చేశారు.

వరల్డ్ కప్‌లో పాల్గొనే అంశంపై తేల్చడానికి పాకిస్తాన్ ప్రధాని షెహెబాజ్ షరీఫ్ ఓ కమిటీ వేశారు. ‘ఈ కమిటీ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో జర్దారీ సారథ్యంలో చర్చిస్తుంది. ఆ 11 మంత్రుల్లో నేను కూడా ఉన్నాను. మేం చర్చించి ప్రధానమంత్రికి సిఫార్సులు చేస్తాం. తుది నిర్ణయం ప్రధాని తీసుకుంటారు’ అని చెప్పారు. బీసీసీఐ చెబుతున్న భద్రతాపరమైన అంశాలనూ ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలు టీమ్స్ పాకిస్తాన్ పర్యటిస్తున్నాయని సమాధానం ఇచ్చారు. ‘న్యూజిలాండ్ టీమ్ ఇక్కడికి వచ్చింది. అంతకు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కూడా పాకిస్తాన్‌లో ఆడింది. వారికి ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ఇచ్చాం. అంతకు ముందు టీమిండియా క్రికెట్ జట్టుకు ఇక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భద్రత అనేది ఒక సాకు మాత్రమే. మేం పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా నిర్వహించాం. అందులో ఎందరో మంది విదేశీ ఆటగాళ్లు ఆడారు’ అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed