ICC World Cup 2023: గోల్డ్‌ మెడల్‌ సాధించిన విరాట్‌ కోహ్లి..

by Vinod kumar |
ICC World Cup 2023: గోల్డ్‌ మెడల్‌ సాధించిన విరాట్‌ కోహ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డుతో పాటు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వాలని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ టి దిలీప్‌ భావించాడు. ఈ అవార్డు రేసులో శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి పోటాపోటీ పడ్డారు. అయితే అంతిమంగా అవార్డు కోహ్లిని వరించింది. మిచెల్‌ మార్ష్‌ అద్భుతమైన డైవింగ్‌ స్టన్నింగ్ క్యాచ్‌తో కోహ్లిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దిలీప్‌ తెలిపాడు. ఆసీస్‌పై విక్టరీ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో సెలబ్రేషన్స్‌ సందర్భంగా దిలీప్‌.. కోహ్లిని బెస్ట్‌ ఫీల్డర్‌గా అనౌన్స్‌ చేస్తూ గోల్డ్‌ మెడల్‌ను అందించాడు. ఈ అవార్డు రేసులో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా పోటీపడ్డాడని దిలీప్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అద్భుతమైన డైవ్ చేశాడని ప్రశంసించాడు.

కేవలం ఒక్క క్యాచ్‌ కారణంగానే కోహ్లికి ఈ అవార్డు ఇవ్వలేదని వివరణ ఇచ్చాడు. దిలీప్‌ అవార్డు బహుకరిస్తుండగా.. కోహ్లి మెడలో వేయాలని కోరాడు. దీంతో దిలీప్‌ గోల్డ్‌ మెడల్‌ను కోహ్లి మెడలో వేశాడు. అనంతరం కోహ్లి మెడల్‌ను నోటితో కొరకుతూ సరదాగా ఫోటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం వైరలవుతుంది. ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story