ICC World Cup 2023: రోహిత్‌కు ఆఖరి వరల్డ్‌కప్‌.. వ్యక్తిగత కోచ్‌ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |
ICC World Cup 2023: రోహిత్‌కు ఆఖరి వరల్డ్‌కప్‌.. వ్యక్తిగత కోచ్‌ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ వయసుపై, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత విజయావకాశాలపై అతని వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతని వయసు 36 సంవత్సరాలు. తదుపరి వరల్డ్‌కప్‌ సమయానికి అతనికి 40 ఏళ్లు వస్తాయి. భారత క్రికెటర్లు ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతారని నేననుకోను. రోహిత్‌కు కూడా అది తెలుసు. కాబట్టి అతను ఈసారి ఎలాగైనా దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాడు. ఇదే సందర్భంగా దినేశ్‌ లాడ్‌ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఇదే టోర్నీలో అతను తన 50వ వన్డే సెంచరీ చేస్తాడని అనిపిస్తుందని అన్నాడు.

ప్రపంచకప్‌ లీగ్‌ దశలో తొమ్మిది వరుస విజయాలతో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ముంబై వేదికగా బుధవారం (నవంబర్‌ 15) జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్‌, విరాట్​కోహ్లి సహా భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంతా భీకర ఫామ్‌లో ఉంది. టాప్‌-5లో నలుగురు బ్యాటర్లు ఇప్పటికే సెంచరీలు కూడా చేశారు. బౌలింగ్‌లోనూ మనవాళ్లు చెలరేగిపోతున్నారు. మన పేస్‌ త్రయం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed