ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఆ సమస్య తీరాలంటే.. తెలుగు కుర్రాడిని తీసుకోండి.. Ravi Shastri

by Vinod kumar |
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఆ సమస్య తీరాలంటే.. తెలుగు కుర్రాడిని తీసుకోండి.. Ravi Shastri
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలి అనే అంశంపై భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్దమవుతున్న భారత జట్టులో యువరాజ్ సింగ్, గంభీర్ పాత్ర పోషించే ఆటగాళ్లు ఎవరు? అని రవిశాస్త్రి ప్రశ్నించాడు. ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్‌లు ఉన్నారన్నారు. 2011 ప్రపంచకప్ సమయంలో గంభీర్, యువరాజ్ సింగ్‌తో పాటు సురేశ్ రైనా రూపంలో మొత్తం ముగ్గురు లెప్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని, ప్రస్తుత జట్టులో టాప్ ఆర్డర్‌లో ఆడగలిగే లెఫ్ట్ హ్యాండర్స్ ఒక్కరు కూడా లేడని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌కు ఇప్పటి వరకు సరైన అవకాశాలే లభించలేదు. రవీంద్ర జడేజా రూపంలో మరో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నా.. టాప్-3లో ఆడగలిగే లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోవడం టీమిండియాకు సమస్యగా మారింది. ఈ అంశంపై తాజాగా ఓ చానెల్‌తో మాట్లాడిన రవి శాస్త్రి.. లెఫ్ట్ హ్యాండర్స్ అవసరాన్ని తెలియజేశాడు.

భారత జట్టుకు లెఫ్ట్ హ్యాండర్స్ సమస్య తీరాలంటే యువ ఆటగాళ్లు అయిన తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్‌లను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. 'టీమిండియా టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోవడం పెద్ద సవాల్‌గా మారనుంది. ఓపెనింగ్ జోడీలో లేకపోయినా.. టాప్-4లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటం చాలా ముఖ్యం. సాధారణంగా టాప్-6లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మంచిదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed